ప్రస్తుత ప్రపంచం సాంకేతిక పరిజ్ణానం అందుబాటులోకి రావటంతో ఓ కుగ్రామంగా మారిపోయింది. ఇంటర్నెట్ అనుసంధానంతో ప్రయోజనాలు పెరిగిపోవటంతో స్మార్ట్ సేవల పేరిట, ఉచిత వైఫై ఇంటర్నెట్ అందించేందుకు ప్రపంచం ఉత్సాహం చూపుతోంది. దీంతో బీచ్ లలో ఈ-ఈత చెట్లు సందడి చేస్తున్నాయి. దుబాయ్ మున్సిపాలిటీకి చెందిన స్మార్ట్ పామ్ సోలార్ టెక్ హచ్ ప్రాజెక్టు ద్వారా బీచ్ లలో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈత చెట్లను తీసుకుని రూపొందించిన ఇవి అచ్చం అదే రూపంలో ఉండటం విశేషం. ఈ ఈ-చెట్లు ఆరు మీటర్లు మాత్రమే ఎత్తు ఉంటుంది. దీనికి ఒకేసారి 12 పరికరాలను అనుసంధానం చేసుకుని ఛార్జింగ్ చేసుకొవచ్చు. సో... అలా ఛార్జింగ్ తోపాటు వైఫై కూడా వాడుకోవచ్చన్నమాట.