ఒక్క రోజులో 10 వేల ఖాతాలను తీసిపడేసింది

April 10, 2015 | 12:49 PM | 42 Views
ప్రింట్ కామెంట్
Twitter_suspended_ten_thousand_accounts_niharonline

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ ఒక్క రోజులోనే సుమారు 10 వేలకుపైగా ఖాతాలను తొలగించింది. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఐఎస్ఐఎస్ మద్దతుదారులు, వారు చర్చించుకుంటున్న ఖాతాలపై నిఘా ఉంచి వాటిని తొలగించినట్లు ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ట్విట్టర్ లో ప్రతి ఒక్క ఖాతాలో వస్తున్న పోస్ట్ లను పరిశీలించడం అసాధ్యమని, అయితే కొన్ని సెర్చ్ వర్డ్స్ ఆధారంగా పోస్టింగ్ చూస్తూ వాటిని సస్పెండ్ లో పెడుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ కు చెందిన సానుభూతిపరులు 90వేలకు పైగా అకౌంట్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ మాధ్యమంగానే ఐఎస్ఐఎస్ రిక్రూట్ మెంట్స్ జరుగుతున్నాయని, దీని నిలవరించడంలో విఫలమవుతున్నారని గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిదే. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటంతోనే ఖాతాల స్తంభన నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ