ఆరు నెలల్లో సగం జగత్ అంతర్జాలమయం

May 30, 2015 | 05:30 PM | 1 Views
ప్రింట్ కామెంట్
internet_world_UNO_niharonline

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. సాంకేతికాభివృద్ధితో ప్రపంచం దూసుకుపోతోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పాకిపోతోంది. ఇక తాజా అధ్యయనంలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. మరో ఆరు నెలల్లో సగం ప్రపంచం ఇంటర్నెట్ వినియోగంతో నిండిపోతుందని తేలింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా మొత్తం దాదాపుగా 720 కోట్లు. యూరప్, అమెరికా వంటి దేశాల్లో 78 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, వర్థమాన దేశాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. ఆసక్తికర విషయమేంటంటే... పేద దేశాల్లో ఈ ఇంటర్నెట్ వినియోగం మరింత త్వరగా విస్తరిస్తోందట. దీంతో రానున్న ఆరు నెలల్లో సగం ప్రపంచం ఇంటర్నెట్ తో కళకళలాడుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ