మళ్లీ వణికిన నేపాల్... భారత్ లోనూ ప్రకంపనలు!

May 12, 2015 | 02:17 PM | 21 Views
ప్రింట్ కామెంట్
another_earthquake_in_nepal_tremours_in_north_india_also_niharonline

నేపాల్ మరోమారు భారీ భూకంపంతో వణికిపోయింది. ఇప్పటికే వరుస భూకంపాలతో నేలమట్టమైన ఆ దేశాన్ని మంగళవారం మధ్యాహ్నాం 12.38 లకు ఒకసారి, 1గంటకు మరోసారి భారీ భూకంపం పలకరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైయ్యిందని తెలుస్తోంది. ఖాట్మాండుకు సుమారు 83 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమయ్యిందని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. నష్టం వివరాలను తెలిపేందుకు అక్కడి మంత్రిత్వ శాఖ నిరాకరించింది. ఇక దీని ప్రభావంతో భారత్ ఉత్తర భాగంలో కూడా పలుచోట్ల భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, మిజోరాం, బీహార్, ఉత్తర ప్రదేశ్ , అస్సాం, ఒడిశా,  రాష్ట్రాలతోపాటు బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో, ముంబైలో కూడా దీని ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. నష్టం వివరాలను హోంశాఖ ప్రస్తుతం పరిశీలిస్తుందని హోం మంత్రి రాజ్ నాథ్ తెలియజేశారు. తీవ్రత తక్కువైనప్పటికీ ప్రస్తుతం సంభవించిన భూకంపం గతంలో వచ్చిన భూకంపం కంటే లోతైనదని తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ 25 న నేపాల్ లో సంభవించిన భూకంపం సుమారు 8 వేల మందిని పొట్టనబెట్టుకోగా, 4 లక్షల  కుటుంబాలను నిరాశ్రయుల్ని చేసింది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ