పెద్దన్న మళ్లీ లైన్లో పడుతున్నాడే!

May 25, 2015 | 12:04 PM | 26 Views
ప్రింట్ కామెంట్
barack_obama_people_support_increased_day_by_day_niharonline

గత కొంత కాలంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా పై వరుసగా విమర్శలు వెలువెత్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంస్కరణల మొదలు, ఇతర దేశాల వ్యవహారంలో జోక్యం చేసుకోవటం తదితర అంశాల ఆధారంగా ప్రతిపక్షాలతోపాటు, ప్రజలు కూడా తీవ్రస్థాయిలో నిందిస్తున్నారు.  అమెరికా అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రోజు రోజుకీ ప్రజల్లో ఆయన ఆదరణ తగ్గుతూ వస్తోంది. 2014 మధ్యంతర ఎన్నికల సమయంలోనైతే అది మరీ దారుణంగా పతనమై 50 శాతం కంటే తక్కువగా నమోదైంది. దీంతో గత కొంత కాలంగా ఆయనకు నిద్రపట్టడం లేదు. అయితే తాజాగా ఓ సర్వేతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ప్రజల్లో ఆయన ఆదరణ మళ్లీ పెరుగుతూ వస్తోందని గాలప్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. క్యూబాతో సంబంధాలు పెంపొందించుకోవటం, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చటం, సున్నితమైన మత సామరస్యమైన అంశాలను సులువుగా పరిష్కరించటంతో ప్రస్తుతం ఆయన రేటింగ్ అమాంతం పెరిగిపోయిందట. ఇక సర్వే ద్వారా వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై విజయావకాశాలు మెరుగుపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ