అవునండీ నిజం. సాధారణంగా చేదు జ్ఞాపకాలు మనల్ని అంత త్వరగా వీడిపోవు. కొన్నిసార్లు అవి మన ప్రశాంతతన చెడగొడతాయి. అంతేనా వాటి వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోయి చెయ్యాలనుకున్న పనులను కూడా సక్రమంగా చెయ్యలేకపోతారు. అయితే వీటన్నింటికి ఓ చిట్కాను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఏంటంటారా? కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ ఉంటుంటే చేదు జ్ఞాపకాల నుంచి ఈజీగా బయటపడొచ్చట. ఈ విషయాన్ని ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు ఓ వంద మంది పై పరిశోధన చేసి చెబుతున్నారు. సాధారణంగా చేదు జ్ఞాపకాలు అంటే మెదడుకు గాయం కావటమేనట. ఇలాంటి వారు అవాంఛిత దృశ్యాలను చూసేందుకు ఇష్టపడరని వారు పేర్కొంటున్నారు. అయితే కంప్యూటర్ గేమ్స్ ఆడటం వల్ల చాలా మంది తమ చేదు జ్ఞాపకాలను వదిలించుకోవటమే కాదు సుఖవంతమైన జీవితాన్ని కూడా గడుపుతున్నారట. సో... హ్యాపీగా గేమ్స్ ఆడుతూ మీరు మీ చేదు జ్ఞాపకాలను మరిచిపోండి.