ఇండోనేషియా ఘోర విమాన ప్రమాదం, 141 మంది మృతి

July 01, 2015 | 05:13 PM | 4 Views
ప్రింట్ కామెంట్
indonesia_plane_crash_army_cargo_plane_niharonline

సుమత్రా దీవిలోని మేడాన్‌ పట్టణంలో ఇండోనేసియాకు చెందిన ఒక సైనిక కార్గో విమానం ఒక హౌటల్‌, కొన్ని ఇళ్లలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 141 కి చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. సుమత్రాదీవిలోని ఒక సైనిక విమాన స్థావరం నుండి టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే ప్రమాదం సంభవించింది. విమానం కిందికి పడిపోతున్న సమయంలో ఒక హౌటల్‌లోకి మరికొన్ని ఇళ్లఓకి దూసుకుపోయిందని ఇండోనేషియా సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలడంతో భవనాల శిథిలాల కింద ఎక్కువ సంఖ్యలో మృత దేహాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  ఇంజిన్‌లో సమస్య వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చు. విమానంలో 12 మంది సిబ్బంది, 101 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించడం లేదు. సైనిక విమానం కావడంతో ప్రయాణీకుల్లో ఎక్కువ మంది భద్రతా బలగాల్లో పనిచేస్తున్నవారు, వారి కుటుంబీకులే ఉన్నారు.  విమానం ఎయిర్ పోర్టు నుంచి గాల్లోకి లేవగానే అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. తర్వాత దాన్నుంచి పొగలు వచ్చాయి. చూస్తుండగానే కుప్పకూలిపోయింది  అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. విమానం చాలా తక్కువ ఎత్తు నుంచే దూసుకుపోవడంతో భయకంపితులమయ్యామని మరొకరు తెలిపారు. ప్రమాదం పట్ల ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదాల నుంచి మనల్ని ఆ దేవుడు రక్షించాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ