ఎక్కడైనా పనికి ఆలస్యంగా వచ్చాడని బాస్ మందలించడమో లేదా జీతంలో కొత విధించటమో మనం చూస్తుంటాం. కానీ, పని సమయానికంటే ముందు వస్తే అతని వర్క్ డెడికేషన్ కి అభినందలు అందించి ప్రొత్సహించాలి కదా. కానీ, పనికి కాస్త ముందు వచ్చాడని ఏకంగా జైలు శిక్ష పడేలా చేశారు అక్కడి అధికారులు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. శాండీ స్పింగ్స్ నగరంలో ఉదయం 7 నుంచి రాత్రి 7 మధ్య మాత్రమే చెత్త సేకరించాలనే నిబంధన ఉంది. కానీ, కెవిన్ మెక్ గిల్ అనే కార్మికుడు కాస్త ముందుగానే అంటే ఉదయం 5 కే పనికి బయలుదేరాడు. ఇక దీనిని గమనించిన అధికారులు మనోడు ఏదో చెయ్యరాని నేరమేదో చేసినట్లు అరెస్ట్ చేయించి కోర్టులో హాజరుపరిచారు. ఇక జడ్జి కూడా అతనికి నెల రోజులు శిక్ష విధించారు. తాను చెప్పిందేదీ న్యాయస్థానం వినిపించుకోలేదని గిల్ వాపోతున్నాడు. అయితే అతనికి కాస్త ఊరట కలిగించేలా వారాంతాల్లో జైల్లో ఉండటం ద్వారా శిక్షా కాలాన్ని పూర్తి చేసుకోవచ్చునని న్యాయమూర్తి వెసులుబాటు కల్పించారు. అమెరికాలో అంతే... అంతే.