మృత్యుంజయురాలు: మృగరాజుల నోటి దాకా వెళ్లి బతికింది

June 05, 2015 | 12:09 PM | 1 Views
ప్రింట్ కామెంట్
girl_neha_sharma_attacked_by_lions_in_southafrica_safari_niharonline

మృగరాజు సింహం పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఒకటికాదు, ఏకంగా నాలుగైదు సింహాల నోటి దాకా వెళ్లోస్తే... కానీ, ఓ 15 ఏళ్ల భారత సంతతికి చెందిన బాలిక వాటి బారిన పడి చావు అంచు వరకు వెళ్లివచ్చింది. ఇండో ఆస్ట్రేలియా కు చెందిన నేహా శర్మ ఇటీవల తన కుటుంబంతో దక్షిణాఫ్రికాలోని వన్యప్రాణుల పార్కుకు వెళ్లింది. అయితే ఆదమరిచి ఉన్న ఆమెపై నాలుగు సింహాలు దాడి చేశాయి. దీంతో తల, మెడ, ఛాతీ, తొడలు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమయానికి సిబ్బంది రావడంతో ముప్పు తప్పింది. ఇక చావు తప్పదని అంతా భావించినప్పటికీ, తిరిగి ప్రాణాలతో బయటపడింది. నేహా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కోలుకుంటున్న ఆ బాలిక దాడి గురించి ఓ లేఖలో వివరించింది.  సింహాలు తనపై దాడి చేసినప్పుడు భయంతో అరిచానని, ఒకటి ఒకటి తన తలను నములినప్పుడు కరకర మనే శబ్ధం వినిపించిందని నేహా శర్మ వివరించింది. దేవుడి దయ వల్ల తన కూతురు ప్రాణాలతో బయటపడిందని, ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చని వైద్యులు తెలిపారని ఆమె తండ్రి రాఘవ శర్మ తెలిపాడు. ఇక ఈ ఘటన జరిగిన కొన్నిరోజులకు జోహెన్నెస్‌బర్గ్ జూలోని సింహాలు ఓ అమెరికా పర్యాటకురాలిని చంపాయి. వాహనంపై దాడి చేసి మరీ ఆమె ప్రాణాలు తీశాయి. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు కాకపోవటంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ