ఉగ్రరాక్షసులు, ఆడా... ఈడా... ఏడైనా ఉంటారట

March 09, 2015 | 04:48 PM | 48 Views
ప్రింట్ కామెంట్
haryana_website_hacked_by_ISIS_niharonline

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్ దుశ్చర్యల గురించి తెలియని వారుండరు. అమాయకులను కిడ్నాప్ చేసి వారి కుత్కుకలపై కత్తులు పెట్టి కోయటం, లేదా పెట్రోల్ పోసి కాల్చి చంపటం తద్వారా వార్తల్లో కెక్కటం మనం చూస్తున్నాం. వారి దాష్టీక చర్యలు ఏరేంజ్ లో అంటే ఆయా వీడియోలను అంతర్జాలంలో అప్ లోడ్ చేసి ఆనందించటం వారి పైశాచికానికి పరాకాష్టం. ఇక ఇప్పుడు ఈ మిలిటెంట్ గ్రూప్ కన్ను భారత్ పై పడినట్టు కనిపిస్తోంది. తాజాగా హర్యానా ప్రభుత్వానికి చెందిన ఎస్.సి.ఆర్.టి వెబ్ సైట్ ను ఐఎస్ఐఎస్ హ్యాక్ చేసింది. ‘మేం ప్రతి చోటా ఉంటాం’ అంటూ ఆ వెబ్ సైట్ హోం పేజీలో ఓ సందేశాన్ని పోస్టుచేసింది. అయితే హోళీ సందర్భంగా ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. సైట్ హోం పేజీలో ఐఎస్ఐఎస్ పతాకాన్ని గుర్తించిన ఓ టీచర్ ఈ విషయాన్ని అధికారులకు తెలియపరిచాడు. దీంతో వారు ఆ సందేశాన్ని తొలగించి సైట్ ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఇక ఈ ఘటనపై సీరియస్ గా దర్యాప్తు కొనసాగుతుంది. కాగా, అధికారిక సమాచారం ఏదైనా తస్కరణకు గురైందా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ