ఛా... గోడకట్టి భీభత్సాన్ని ఆడ్డుకునే సీనుందా?

March 23, 2015 | 05:44 PM | 92 Views
ప్రింట్ కామెంట్
Great_Wall_of_Japan_niharonline

కాల ప్రవాహంలో మనిషి జీవితం చిన్న అల. కాలాన్ని, ప్రకృతిని ఎదిరించి ఎవరూ నిలవలేరు... నిలవబోరూ కూడా.  అలాంటిది ప్రకృతి వైపరీత్యానికి ఎదుర్కొనేందుకు జపాన్ చేసే ఓ ప్రయత్నం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.  సముద్రానికి అడ్డంగా  గోడ కట్టేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించనుంది. సుమారు ఐదు అంతస్తుల ఎత్తుండే భారీ సిమెంట్ గోడను నిర్మించటం ద్వారా సునామీ ప్రమాదాన్ని ఎదుర్కొవాలని జపాన్ యోచిస్తోంది. దీనికోసం రూ.40,800 కోట్ల వ్యయంతో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. సుమారు 12.5 మీటర్ల ఎత్తులో బలంగా ఉండే ఈ గోడ సునామీ అలలను నిరోధిస్తుందని, ఉత్తర ఒసాబేలోని కజుతోషి ముసాషీ పోర్ట్ సమీపంలో నిర్మిస్తామని జపాన్ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాగా, సిమెంట్ గోడవల్ల ప్రజలకు ప్రయోజనం తక్కువేనని, సముద్ర తీర పర్యావరణం, ప్రకృతి అందాలకు నష్టం వాటిల్లుతుందని మత్సకారుల జీవనభ్రుతికి ఆటంకాలు ఏర్పడుతాయని ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. మరోవైపు గోడ నిర్మాణం చేపడితే తమకు భారీగా ఉద్యోగవకాశాలు వస్తాయని ఆ ప్రాంతంలోని యువత ఆనందిస్తోంది. పిచ్చి కాకపోతే అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యున్ని ఆపగలమా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ