అస్సలు తగ్గట్లేదు: లిజార్డ్ స్క్వాడ్ లెనోవానూ హ్యాక్ చేసి పడేసింది

February 26, 2015 | 03:38 PM | 75 Views
ప్రింట్ కామెంట్
lenovo_hacking_by_lezard_niharonline

ఈ మధ్య తరచు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లతోపాటు ప్రముఖ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్న లిజార్డ్ స్క్వాడ్ తాజాగా లెనోవో వెబ్ సైట్ ను హ్యాక్ చేసింది. లెనెవో వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైనట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇంకోవైపు తామే ఈ హ్యాకింగ్ కు పాల్పడినట్లు లిజార్డ్ స్క్వాడ్ కూడా ట్విట్టర్ ద్వారా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం లెనోవో యూజర్లకు పలు సూచనలు చేసింది. వైరస్ తరహా సాప్ట్ వేర్ సూపర్ ఫిష్ ను ల్యాప్ టాప్ ల నుంచి తొలగించాలని సలహా ఇచ్చింది. ఆ ఫ్రీ ఇన్ స్టాల్డ్ సాఫ్ట్ వేర్ కారణంగా ల్యాప్ టాప్ లపై సైబర్ దాడులు సులువవుతాయని వివరించింది. కిందటి నెలలో లిజార్డ్ స్క్వాడ్ సోనీ కార్పొరేషన్ ప్లే స్టేషన్ నెట్ వర్క్ పైనా, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ లైవ్ నెట్ వర్క్ పైనా దాడులు చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ