సరదాగా విదేశాలకు విహారయాత్ర వెళ్లాలనుకునేవారికి ఓ సర్వే షాకింగ్ న్యూస్ ను అందిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాద నగరాల జాబితాను విడుదలచేసింది. వెనిజులా లోని కారకస్, మెక్సికో లోని సియుడాడ్ జువారెజ్, అకాపుల్కో నగరాలు, ధక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్, బ్రెజిల్ లోని రియో డీ జనీరో, గ్వాంటెమాలా లోని గ్వాంటెమాలాసిటీ, ఇరాక్ లోని బాగ్ధాద్, ఆప్ఘనిస్థాన్ లోని కాబూల్, పాకిస్థాన్ లోని కరాచీ, హోండూరస్ లోని శాన్ పెడ్రో సూలా నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. క్రైం రేటు అధికంగా ఉండటంతోపాటు అరాచక శక్తులు విరుచుకుపడే ప్రమాదం ఉన్నందున ఆయా నగరాలను జాబితాలో చేర్చినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇక పై ఈ నగరాలకు టూర్లకు వెళ్లేవారు కాస్త ముందు వెనుక పరిస్థితులను పరిశీలించి వెళ్లటం బెటర్ అన్న మాట.