అంగారకుడి పై కూడా కూల్ గా జీవించేయొచ్చట

June 17, 2015 | 04:37 PM | 1 Views
ప్రింట్ కామెంట్
nasa_mars_human_life_niharonline

కఠినమైన వాతావరణం కలిగి ఉండే గ్రహంగా అంగారకుడికి పేరుంది. జీవ రాశి బతికేందుకు అక్కడ పరిస్థితులు అనుకూలం కాదని నాసా మొదట్లో తేల్చి చెప్పింది. అయితే క్యూరియాసిటీ పరిశోధనలతోపాటు అంగారక యాత్ర కూడా ఆయా పరిస్థితులను పూర్తిస్థాయిలో బేరీజు వేస్తున్నాయి. మొత్తానికి ఓ అంచనాకి వచ్చిన శాస్త్రవేత్తలు ఇక తాజాగా ఈ అరుణ వర్ణ గ్రహంపై ఇప్పుడు జీవించటం సాధ్యమేనంటున్నారు అమెరికా పరిశోధకులు. అంగార గ్రహానికి చెందిన శిలలపై నిర్వహించిన పరిశోధనల ద్వారా ఈ నిర్ణయానికి వచ్చారు. వారు పరిశీలించిన అన్ని శిలల్లోనూ మీథేన్ ఉన్నట్టు గుర్తించారు. అంగారక గ్రహంపై మూలాధార జీవులు మీథేన్ ను ఆహార వనరుగా ఉపయోగించుకుని ఉంటాయని వారు ఓ అంచనాకు వచ్చారు. భూమిపై మైక్రోబ్స్ ఇలాగే మీథేన్ ను వినియోగించుకుంటాయని పరిశోధనలో పాలుపంచుకుంటున్న యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షాన్ మెక్ మహోన్ తెలిపారు. మార్స్ లో లభ్యమయ్యే మీథేన్ అయినాగానీ మైక్రోబ్స్ కు నేరుగా అందదని అన్నారు. మీథేన్ వాయువు జీవి ఉనికికి ఆధారమని ఆయన వివరించారు. ఒకరకంగా చెప్పాలంటే జీవరసాయనిక చర్య కారణంగానే మీథేన్ వాయువు వెలువడుతుందని మెక్ తెలిపారు. ఇక ఈ ప్రయోగాలతో మార్స్ యాత్రనే కాదు, ఏకంగా అక్కడ జీవించే ప్రయత్నాలకు కూడా ప్రయత్నాలు ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను ముమ్మరం చేస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ