ఒక్కరాత్రి సంబరాలు ఆ దేశానికి పెనుముప్పుగా మారాయి

February 21, 2015 | 10:47 AM | 38 Views
ప్రింట్ కామెంట్
chinese_new_year_pollution_niharonline

కొత్త సంవత్సరం సంబరాలు అంటే ఎవరికైనా ఆసక్తి, ఆరాటం ఉండటం సహాజమే. కానీ, ఓ దేశంలో చేసిన న్యూఇయర్ వేడుకలు ఆ దేశానికి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. దీనికి కారణమేంటంటారా... అతిగా బాణాసంచాను పేల్చటం. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 19న చైనా లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు భారీ మొత్తంలో బాణాసంచాను పేల్చారు. దీంతో ఏం జరిగిందంటే ఊహించనిస్థాయిలో అక్కడి వాతావరణం కలుషితమయ్యిందట. ఎంతగా అంటే సాధారణం కంటే 25 రెట్లు ఎక్కువగా అక్కడి గాలిలో కాలుష్యం చోటుచేసుకుందని చైనా అధికారిక పత్రిక పేర్కొంది. ఇక 106 పట్టణాలలో అయితే ఏకంగా ఆ స్థాయి ప్రమాద స్థాయి కి చేరిందని తెలిపింది. అది కూడా కేవలం బుధవారం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు ఉపయోగించిన బాణాసంచా కారణంగానే ఇంత కాలుష్యం చోటుచేసుకుందని ఆ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రచురించింది. దీని మూలంగా పశువులు, పక్షులతోపాటు అక్కడక్కడ చిన్నపిల్లలు కూడా మ్రుత్యు వాత పడుతున్నారని తెలుస్తోంది. న్యూఇయర్ వేడుకలకు చైనీయులు అత్యంత ప్రాముఖ్యం ఇస్తారు. అంతేకాదు పెరిగిన నగరీకరణ మూలంగా అక్కడి జనాలు ఇలా అతిగా చేశారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ