ఇస్లాంపై కాదు... ఉగ్రవాదం పైనే మాపోరు

February 19, 2015 | 04:59 PM | 43 Views
ప్రింట్ కామెంట్
obama_fires_on_ISIS_niharonline

ఇస్లాం మతానికి అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ వ్యతిరేకమనే ఉగ్రవాదుల వాదనకు అగ్రరాజ్యం అధ్యక్షుడు ఒబామా ధీటైన జవాబిచ్చారు. తమ పోరు ఇస్లాంతో కాదని, మతానికి వక్రభాష్యాలు చెబుతూ ఉగ్రవాదానికి పాల్పడే వారి పైనేనని ఆయన స్పష్టం చేశారు. గురువారం వైట్ హౌస్ లో తీవ్రవాద వ్యతిరేక సదస్సులో ప్రసంగించిన ఆయన ఐఎస్ఐఎస్, అల్ ఖైదా వంటి సంస్థల తీరును ప్రపంచంలోని ముస్లింలంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇస్లాం రాజ్యస్థాపన అంటూ వెర్రెత్తిపోయే ఉగ్రవాదులు... ముస్లింల జీవన స్థితిగతులను ఏనాడూ పట్టించుకున్నపాపన పోలేదని ఒబామా విమర్శించారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇస్లాంను తృణీకరిస్తాయనే అబద్ధాన్ని యువత మెదళ్లలో నూరిపోయడం ద్వారా వారిని ఆయా ఉగ్రసంస్థల్లోకి లాక్కొని తద్వారా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు అమెరికాతో సహకరించాలని సదస్సులో పాల్గొన్న దాదాపు 60దేశాల ప్రతినిధులకు ఒబామా విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ