కుక్క కోసం కసితీరా కరిచిన బామ్మ

June 19, 2015 | 05:01 PM | 1 Views
ప్రింట్ కామెంట్
old_woman_bite_dog_to_save_her_pet_niharonline

కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త. ఇప్పుడు ఆ వార్తే దొరికిందండోయ్ మనకు. యార్క్ షైర్ లోని డేవోన్ ప్రాంతంలో జాన్ హట్టన్ అనే ఓ వృద్ధురాలు అల్సేషియన్ కుక్కను కరిచి వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళ్లితే... ఆమె తన పెంపుడు కుక్క మిల్లీని తీసుకుని వాకింగ్ కి బయలుదేరింది. ఇంతలో ఓ భారీ అల్సేషియన్ శునకం ఆ చిన్న కుక్క పిల్లపై దాడిచేసింది. తన పెంపుడు కుక్కను రక్షించుకునేందుకు రంగంలోకి దిగిన హట్టన్ వెంటనే అల్సేషియన్ పై విరుచుకుపడి మెడను కసితీరా కొరికింది. అయినా, ఫలితం లేకపోయింది. పాపం మిల్లీ ప్రాణాలు వదిలింది. ఇంతలో ఆ అల్సేషియన్ యజమాని వచ్చి దానిని పట్టుకున్నాడు. అనంతరం హట్టన్ కు క్షమాపణ చెప్పాడు. దీనిపై హట్టన్ స్పందిస్తూ... తన గారాల పెంపుడు కుక్కను రక్షించేందుకు ఏం చెయాలో అర్థం కాలేదని, ఆ కోపంలో కుక్కను కసితీరా కొరికానని కన్నీటితో చెప్పింది. ఆ సమయంలో తన చేతిలో గనుక కత్తి ఉండుంటే ఆ అల్సేషియన్ ను కండఖండాలుగా నరికేదానినని ఆవేశం ప్రదర్శించిందా వృద్ధురాలు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ