ప్రపంచవ్యాప్తంగా నికార్సైన నిఘంటువుగా (డిక్షనరీ) ఆక్స్ ఫర్డ్ కు మంచి పేరుందది. ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో ప్రతి ఏడాది కొత్త పదాలను చేర్చుతుంటారు. దాదాపు అన్ని భాషలకు చెందిన బాగా ప్రాచుర్యంలో పదాలను ఎంపిక చేసి వాటిని డిక్షనరీలో పొందుపరుస్తారు. భారతీయ భాషలకు చెందిన పదాలు కూడా ఆక్స్ ఫర్డ్ లో చోటుచేసుకుంటు ఉంటాయి. ఈ ఏడాది గానూ ఆక్స్ ఫర్డ్ విడుదల చేసిన కొత్త పదాల జాబితాలో బారత్ కు చెందిన కొన్ని పదాలు చోటుసంపాదించుకున్నాయి. వీటిలో ఎక్కువగా ఉపయోగించే అరె యార్ అన్న పదానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పదంగా చోటు కల్పించారు. అంతేకాదు చుడీదార్, ధాబా, భేల్ పురి పదాలను, వాటి అర్థాలతోసహా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు. ఇక మొత్తం మీద దాదాపు 500 పదాలకు ఈ ఏడాదికి గానూ ఆక్స్ ఫర్డ్ చోటుకల్పించింది.