ఫేస్ బుక్ చాట్ చేశాడు... జాబ్ పీకి పడేశారు

May 29, 2015 | 12:21 PM | 4 Views
ప్రింట్ కామెంట్
facebook_chat_in_office_lost_your_job_niharonline

ఆఫీసులో విధులు నిర్వహిస్తూ ఫేస్ బుక్ ఓపెన్ చేసినందుకు ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే... ఓ ఉద్యోగి ఆఫీస్ టైం లో  పని మానేసి యువతులతో  ఫేస్ బుక్ లో ఛాటింగ్ చేస్తూ టైం గడుపుతూ వచ్చాడు. అయితే పని పక్కన  బెట్టి ఆ యువకుడు చేస్తున్న తతంగంపై కంపెనీ యాజమాన్యం ఓ కన్నేసింది. అంతేకాదు కంపెనీ బాస్ అయిన ప్రింటర్ ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఉద్యోగితో చాట్ చేశాడు.  ఆ బండారాన్ని రెడ్ హ్యాండెడ్ గా బయటపెట్టి, అనంతరం అతన్ని ఉద్యోగం నుంచి తీసేశాడు. ఇక ఉద్యోగి ఇది అన్యాయమంటూ కోర్టు మెట్లెక్కాడు. విచారణ చేపట్టిన కోర్టు ఆఫీస్ పని సమయంలో ఫేస్ బుక్ ఓపెన్ చేసేవారిపై నిఘా ఉంచటం తప్పేమి కాదని రూలింగ్ ఇచ్చింది. అంతేకాదు కంపెనీ యాజమాన్య నిర్ణయం తప్పేమి కాదని తీర్పు ఇచ్చింది. అన్నట్టు ఇది జరిగింది మన దేశంలో కాదులేండి. ఇటలీలో... తీర్పిచ్చింది ఇటలీ సుప్రీంకోర్టు.  ఈ తరహా కేసులు వస్తే మన కోర్టులు కూడా ఇదే తరహా తీర్పిచ్చే అవకాశాలున్నాయి. సో... బీ కేర్ ఫుల్ బ్రదర్స్!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ