ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్

May 09, 2015 | 02:05 PM | 35 Views
ప్రింట్ కామెంట్
david_cameron_second_term_problems_ready_for_him_niharonline

మరోసారి ప్రధానిగా గెలిచానని సంబరపడుతున్న డేవిడ్ కామెరూన్ కు అసలు కష్టాలు ముందున్నాయని, వాటి నుంచి అంత సులువుగా తప్పించుకోలేరని బ్రిటన్ పత్రికలు వ్యాఖ్యానించాయి. స్కాట్లాండ్ ను యూకేలో కలిపి ఉంచటం, యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ ను భాగంగా కొనసాగించటం ఆయన ముందున్న సవాళ్లని మీడియా అభిప్రాయపడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను తారుమారు చేస్తూ బ్రిటన్ ప్రజలు ఆయనను వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు బ్రిటన్ లో నువ్వా? నేనా? అన్న రేంజ్ లో తలపడగా, స్కాటాండులో మాత్రం స్కాటిష్ నేషనల్ పార్టీ 59 సీట్లలో 56 గెలుచుకుని కామెరూన్ పక్కలో బల్లెమైందని పత్రికలు వ్యాఖ్యానించాయి.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ