పురాతన పుస్తకం, యూరప్ లో మాయమై అమెరికాలో తేలింది

April 24, 2015 | 11:46 AM | 53 Views
ప్రింట్ కామెంట్
st_peter_basilica_rome_book_found_in_argentina_niharonline

రోమ్ లో చోరికి గురైన సంవత్సరం తర్వాత అర్జెంటీనాలో వెలుగులోకి వచ్చిందో 18 వ శతాబ్దంనాటి విలువైన పుస్తకం. సెయింట్ పీటర్ బాసిలికాకు చెందిన ఈ పుస్తకం 1748 నాటిది. రోమ్ లోని ఓ ప్రైవేట్ లైబ్రరీ నుంచి ఇది దొంగిలించబడింది. సదరు లైబ్రరీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ స్టోర్ లో పుస్తకం ఉన్నట్లు గుర్తించిన అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్ లైన్ లో ఈ పుస్తకం విలువ సుమారు రూ.2.31 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పుస్తకంలో అంత విలువైన సమాచారం ఏముందా అన్నది మాత్రం అధికారులు చెప్పకపోవటంతో సస్పెన్స్ వీడట్లేదు. ఈ పుస్తకం బయటపడితే బాసిలికాకు చెందిన మిస్టరీలు వీడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ