ఫేస్ బుక్ పిల్లాడి ఫోటో పెద్ద సాయమే చేసింది

April 16, 2015 | 05:15 PM | 121 Views
ప్రింట్ కామెంట్
Success_Kid_sam_griner_father_kidney_niharonline

సోషల్ మీడియాల్లో సరదాగా చేసే పనులు ఒక్కొసారి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెడుతుంటాయి. అలాగే ఏడేళ్ల క్రితం విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ తో ఉన్న ఓ పిల్లాడి ఫోటో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి చేసింది. సక్సెస్ కిడ్ గా ప్రాచుర్యం పొందిన ఆ ఫోటోకు ట్యాగ్ లైన్లు పెట్టి ఎన్ని రకాలుగా వాడుకోవాలో నెటిజన్లు అన్ని రకాలుగా వాడుకున్నారు. 2007 ఆగష్టు 26 న సామ్ గ్రినర్ అనే బాలుడి ఫోటోని అతని తల్లి లెనీ గ్రినరీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి అది నెట్ లో హల్ చల్ చేస్తూనే ఉంది. ఇక ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆ బాలుడి మళ్లీ ఫేస్ బుక్ లో దర్శనమిచ్చాడు. ఈ సారి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి సాయం చేయాల్సిందిగా అర్థించాడు. అందుకు సుమారు 47 లక్షల దాకా సాయం అవసరమవుతుందని, దాతలు స్పందించాలని కోరాడు. అంతే అతడి పిలుపుకి విశేష స్పందన వచ్చింది. ఏకంగా 50 లక్షల వరకు విరాళం వచ్చిపడింది. ఇంకొందరయితే కిడ్నీలు సైతం ఇచ్చేందుకు ముందుకు వచ్చారట. ఇక ఈ సాయంపై బాలుడు హర్షం వ్యక్తంచేశాడు. సరదాగా చేసిన తన తల్లి ప్రయత్నం ఈ రోజు ఇంత పెద్ద సాయం చేస్తుందని ఊహించలేదని కంట తడి పెట్టుకున్నాడు. సామాజిక మాధ్యమాలు మంచికి వినియోగించుకుంటే చాలా ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా నిపుణులు చెబుతున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ