గంటన్నర వ్యవధిలో మూడు... శిథిలాల కింద వేల మంది!

April 25, 2015 | 02:44 PM | 168 Views
ప్రింట్ కామెంట్
nepal_earthquake_niharonline

నేపాల్ లో గంటన్నర వ్యవధిలో మూడో భూకంపం నమోదైంది. దీని కేంద్రం కూడా నేపాల్ లోనే ఉన్నట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై తాజా భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. కాగా, పలు ప్రాంతాల్లోని పాత భవంతులు కుప్పకూలగా వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని సమాచారం. వీరిలో ఎంత మంది చనిపోయి ఉంటారో చెప్పటం కష్టమని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు సత్వరమే ప్రారంభించినప్పటికీ వరుసగా మూడు ప్రకంపనలు రావటంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఇక ఖాట్మాండులోని ప్రభుత్వాసుపత్రికి క్షతగాత్రులు కుప్పలు కుప్పలుగా చేరుకుంటున్నారు. దేశం అంతటా బీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. కమ్యూనికేషన్, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలగడంతో సహాయక చర్యలు మరింత జఠిలంగా మారుతున్నాయి. ఇక భూకంప తీవ్రవ పాత ఖాట్మాండులోని హనుమాన్ డోక ప్రాంతంలో చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడే ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేలమట్టం అయినట్లు తెలుస్తోంది. కాగా, ఇక్కడ ధరారా టవర్ కుప్పకూలగా దాని శిథిలాల కింద కనీసం 400 చిక్కకున్నట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చునని అంచనా వేసిన నేపాల్ ప్రభుత్వం అక్కడ అత్యవసర పరిస్థితిని విధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ