ఎంత సంపాదించిన చివరి క్షణాల్లో లేని మనశ్శాంతి ఎందుకనుకున్నారో ఏమో ఈ మధ్య బిలినీయర్లంతా తమ ఆస్తులను దానధర్మాలకు, ట్రస్ట్ లకు కొంతమేర రాసిస్తున్నారు. ఈ మధ్యే టాప్ బిలినియర్ వారెన్ బఫెట్ తన ఆస్తిలోని సగభాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆపిల్ చీఫ్ టిమ్ కుక్ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వస్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సేవల సంస్థ కు హెడ్ అయిన ఆయన తన ఆస్తినంతటినీ దాత్రుత్వ కార్యకలపాలకు రాసివ్వాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ఫార్చ్యూన్ మాగజైన్ వెల్లడించింది. పదేళ్ల వయస్సున్న తన మేనల్లుడి కాలేజీ విద్యకు అవసరమయ్యే మొత్తం మినహా మిగతా ఆస్తులన్నింటినీ దానధర్మాలకు వెచ్చించనున్నారని, అందుకోసం ప్రణాళికలను సిద్ధంచేశారని పేర్కొంది. ప్రస్తుతం 54 ఏళ్ల కుక్ వద్ద 785 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.49, 141 కోట్లు విలువైన ఆస్తులున్నాయి. అవును మరీ ఎన్ని వేలకోట్లు సంపాదించిన పోయేప్పుడు కట్టుకుపోతారా ఏంటి?