దాష్టీకం: 127 మందిపై సైన్యం సామూహిక అత్యాచారాలు

May 15, 2015 | 04:22 PM | 36 Views
ప్రింట్ కామెంట్
women_gang_rape_in_kaango.jpg

కాపాడాల్సిన వారే అక్కడ కాల యముళ్లు అయి కాటేశారు. చిన్నా పెద్ద తేడా తెలీకుండా విచక్షణ మరిచి ఆడాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. అది తూర్పు కాంగోలోని దక్షిణ కీవ్ ప్రావెన్స్.. ప్రతి నిత్యం ఓ యుద్ధం,.. దుండగులు ఎప్పుడు ఇళ్లపై పడతారో తెలియదు. ఎప్పుడు ఎలా వస్తారో తెలియక   ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి ఆడపిల్లలు బ్రతుకుతున్నారు. ఈ అఘాయిత్యాలకు పాల్పడేది సొంత సైన్యం కావటం సిగ్గుచేటు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ లూటీలు, అత్యాచారాల గురించి డాక్టర్స్ విత్ అవుట్ బోర్డర్స్ అనే స్వచ్చంద సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఆ సంస్థ తెలిపిన వివరాల మేరకు... కాంగోలోని కీవ్ ప్రావెన్స్‌లో ఆర్మీ మిలిషియాకు చెందిన వారు ఇళ్లపై దాడులు చేశారు. విలువైన వస్తువులు దోచుకున్నారు. మహిళలను బయటకు లాగేశారు. పసిపిల్లలు అని తేడా లేకుండా వరసపెట్టి సామూహిక అత్యాచారాలు చేశారు. ఇలా సుమారు 127 మంది మీద అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన వారిలో 14-70 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అత్యాచారానికి గురైన వారు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావడం లేదని వారు భయపడుతున్నారు ఆ సంస్థ పేర్కొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ