ఆనందించాలా, ఆందోళన చెందాలో అర్థం కానీ అంశం ఒకటి ఇప్పుడు వెలుగుచూసింది. ఆ మధ్య వచ్చిన సర్వేలా రిపోర్ట్ ల ప్రకారం 2050 వరకు ముస్లిం జనాభా భారత్ లో పెరుగుతుందని తెలిపిన విషయం తెలిసిందే. కానీ, అది చాపకింద నీరులా నెమ్మదిగా జరిగిపోతుందట. దేశంలో మతాల వారిగా జనాభా లెక్కలకు సంబంధించిన వివరాల్ని ప్రకటించారు. 2001 నుంచి 2011 మధ్య కాలంలో దేశంలోని వివిధ మతాల మధ్య జనాభా వృద్ధి రేటులో వచ్చిన మార్పును ఈ గణాంకాలు బయటపెట్టాయి. దేశంలో మెజార్టీలుగా చెప్పే హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గుదల నమోదు అయితే.. మైనార్టీలుగా భావించే ముస్లింల వృద్ధి రేటు 0.8 వృద్ధి చెందటం గమనార్హం.
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభా 121 కోట్లుగా లెక్క తేల్చారు. ఇందులో హిందువుల సంఖ్య 96.63 కోట్లు (వృద్ధి రేటు 16.8శాతం) . అంటే దేశ జనాభాలో 79.8శాతం. ఇక.. ముస్లింల జనాభా 17.22కోట్లు (వృద్ధి రేటు 24.6శాతం) . క్రైస్తవుల జనాభా 2.78 కోట్లు (15.5శాతం).. బౌద్ధులు 84 లక్షలు.. జైనులు 45 లక్షలు.. ఇతర మతాల వారు 79 లక్షలు అయితే.. ఏ మతానికి చెందని వారు 29 లక్షల మంది. దేశంలో మిగిలిన మతాల పెరుగుదలలో పెద్దగా మార్పు రాకపోవటం.. హిందువుల జనాభా వృద్ధి రేటు పడిపోతే.. వీటన్నింటికి భిన్నంగా ముస్లిం జనాభా దేశంలో పెరుగుదల నమోదు కావటం గమనార్హం. మత సామరస్యానికి ప్రతీకైన మనదేశంలో ముస్లిం జనాభా పెరగటం ఆనందించదగ్గ విషయమైనా... హిందూ జనాభా తగ్గిపోవటంపై మాత్రం నిజంగా ఆందోళన చెందాల్సిందే.