తాజ్ మహల్ స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నమైన కట్టడం. ప్రపంచ వింత. తన భార్య జ్నాపకార్థం షాజహన్ 1000 ఏనుగులను, 2200 మనుషులను ఉపయోగించి కట్టించాడీ అపరూప కట్టడం. కానీ, ఉత్తరప్రదేశ్ కు ఓ ప్రేమికుడు ఒంటరిగా నయా తాజ్ మహల్ కట్టేందుకు సిద్ధమయ్యడు. కానీ, ఆయనో వృద్ధ ప్రేమికుడు కావటం విశేషం. ఫైజుల్ ఖాద్రి ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. 1953లోనే ఇతగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె.. 2011లో క్యాన్సర్ తో మరణించారు. ప్రస్తుతం ఏనభై ఏళ్ల వయసులో ఉన్న ఖాద్రి.. తన భార్య స్మృతి చిహ్నంగా ఏదైనా కట్టడాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు.. మరో తాజ్ మహాల్ ను నిర్మించాలని భావించిన ఆయన.. తన భార్య నగల్ని..భూమిని అమ్మేశాడు. ఇప్పటికి రూ.11లక్షలు ఖర్చు చేసి తన తాజ్ మహాల్ ను నిర్మించసాగాడు.
అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా నిర్మాణం ఆగిపోయింది. అతగాడి కలల తాజ్ మహాల్ నిర్మాణం పూర్తి కావాలంటే మరో ఆరేడు లక్షల రూపాయిలు అవసరమవుతాయి. అయితే.. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు అతనికి సాయం చేయటానికి ముందుకొచ్చారు. చివరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సైతం.. ఖాద్రి ప్రేమ వ్యవహారం విని కదిలిపోయి.. ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారట. అంత వయసులో అతగాడి ప్రేమ అఖిలేశ్ ను కదిలించేసిందన్నమాట. ప్రేమా జిందాబాద్...