ఆమెను జూమ్ చేస్తూ బుక్కయ్యాడు

December 11, 2014 | 11:13 AM | 42 Views
ప్రింట్ కామెంట్

ప్రజాసమస్యలపై చర్చిస్తూ, ప్రజా జీవనాన్ని మెరుగు పరిచేందుకు చట్టాలను చేయాల్సిన శాసనసభలో మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారు. బీదర్ జిల్లా ఔరాద్ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ శాసనసభలో కూర్చొని మొబైల్ లో నరేంద్ర మోదీ, బాబా రాందేవ్ ల ఫొటోలను చూశారు. అనంతరం ప్రియాంక గాంధీ ఫొటోను చూశారు. ఈ క్రమంలో ప్రియాంక ఫొటోను ఆయన జూమ్ చేస్తుండగా... మీడియా కంట పడింది. దీంతో, ఈ విషయం మీడియాలో హల్ చల్ చేసింది. జరిగిన ఘటనకు ప్రభు చౌహాన్ సమాధానమిస్తూ, శాసనసభలోకి ఫోన్ తీసుకెళ్లకూడదనే నియమాన్ని పాటించకపోవడం నేను చేసిన మొదటి తప్పు. సభలో జామర్లు కూడా సరిగా పనిచేయలేదు. ఏదో మెసేజ్ వచ్చినట్టనిపించి చెక్ చేసుకున్నా. నా ఫోన్ లో వివిధ సందర్భాల్లో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రియాంకగాంధీది కూడా ఉంది. ఆమె వ్యాఖ్యలు చదవడం కోసం జూమ్ చేశారు. అంతేతప్ప నాకు మరే చెడు ఉద్దేశం లేదు అంటూ వివరణ ఇచ్చుకున్నారు. వ్యాఖ్యల కోసం ఫోటోలను జూము చేయాల్సిన అవసరం ఉందంటారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ