జ్యోతిష్యంపై కూడా కౌంటర్లు వేసుకుంటున్నారు

December 18, 2014 | 12:28 PM | 27 Views
ప్రింట్ కామెంట్

ఇందిరాగాంధీకి పుత్రోదయం కాగానే, బాబు పూర్తి జాతకాన్ని రాయించాలని అప్పటి ప్రధాని నెహ్రూ కోరారట. ఈ మేరకు ఆయన రాసిన లేఖను బీజేపీ విడుదల చేసింది. జ్యోతిష్య విద్యను అభ్యశించడం వృథా అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ లేఖను బయటకు తేవడం గమనార్హం. 1944లో ఆగస్టు 29వ తేదీతో ఉన్న ఈ లేఖను కృష్ణ హుతీసింగ్ అనే వ్యక్తికి నెహ్రూ రాసారు. బిడ్డ పుట్టిన ఖచ్చితమైన సమయాన్ని రికార్డు చేయాలని, పూర్తి జాతకం తయారుచేయాలని కోరారు. ఇదే విధమైన లేఖను ఇందిరా గాంధీకి కూడా ఆయన రాసారట. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని ఓ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్ళడం, ఆ పై ప్రతిపక్షాలు దీన్ని ఖండిస్తూ, విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యాన్ని నమ్మడం శాస్త్రీయ దృక్పథానికి దూరమని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో, నెహ్రూనే జాతకం కోరాడని బీజేపీ సాక్ష్యం తేవడంతో, కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ