ఈశాన్య రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం స్వల్ఫ భూకంపం సంభవించింది. ఆయా రాష్ట్రాలతోపాటు సరిహద్దు దేశం బంగ్లాదేశ్ లో కూడా స్పల్ఫ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. అయితే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంది. ఎవరైనా మరణించారా? అన్న విషయం బయటికి రాలేదు. శుక్రవారం వేకువజామున 3.45 కి ఈ భూకంపం సంభవించినట్లు కేంద్ర భూకంప సమచార కేంద్రం ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 4.9 గా నమోదైంది. అస్సాంలోని కరీంగంజ్ జిల్లా లో భూకంప కేంద్రం నమోదైనట్లు వారు వెల్లడించారు.
అస్సాంతోపాటు మేఘాలయా మరికొన్ని ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపన ఛాయలు కనిపించినట్లు సమాచారం. కనీసం 10 నుంచి 12 సెకన్లపాటు భూమి కంపించిందట. బంగ్లాదేశ్ లో జరిగిన నష్టం గురించి కూడా వివరాలు తెలియరాలేదు. ఇక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయా, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ లు తీవ్ర భూకంప ప్రాంతాలుగా ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నాయి.
తాజాగా పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ తోపాటు ఉత్తర భారతంలో కూడా భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఆ విలయం ధాటికి సుమారు 150 మంది చనిపోయారు.