గత వారం 850 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవటంతోపాటు ఆగ్రహాం పెల్లుబికింది. దీంతో ప్రభుత్వం దాన్ని వెంటనే ఉపసంహరించుకుంది. అశ్లీలం పొంగిపొర్లే వెబ్ సైట్లకు నెట్‌లో కొదవలేదన్నది జగమెరిగిన సత్యం. వాటిని వీక్షించేందుకు అలవాటుపడిన వారికి అదో వ్యసనంలా తయారవుతుందని సామాజిక వేత్తలంటుండగా, వాటిని నిషేధించేందుకు ప్రభుత్వాలు విఫలయత్నాలు చేయడం తెలిసిందే. పోర్నోగ్రఫీ వీక్షించడం వల్ల నష్టమేనని చెప్పేవారు, దానివల్ల కలిగే లాభాలను విస్మరిస్తున్నారని అంటున్నారు మరికొందరు. అశ్లీలాన్ని చూడడం కారణంగా శృంగారపరమైన సమస్యలు, ఆలోచనల్లో మార్పురావడం వంటివి జరిగినట్టు దాఖలాలేవీ లేవని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయని వారంటున్నారు. ఫోర్నోగ్రఫీ వీక్షణ వల్ల సెక్స్ పట్ల ప్రజల దృక్పథాల్లో మార్పు వస్తుందని పరిశోధనలు తెలిపాయట.
దీనిపై సుప్రీంకోర్టు ఈ రోజు తీవ్రంగా స్పందించిందది. వ్యక్తిగతంగా పోర్నోగ్రఫీ చూసే విషయంలో ఓ వ్యక్తి హక్కుకు ప్రభుత్వం మద్దతిస్తుంది. అని కేంద్ర తరపున అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు. అశ్లీ వెబ్ సైట్లపై ఇటీవల సుప్రీంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే పిల్లలకు సంబంధించిన వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సి ఉంటుందని రోహత్గీ వెల్లడించారు. అయితే ప్రజల పడక గదుల్లోకి ప్రభుత్వం ప్రవేశించబోదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ అంశంపై సమాజంలో, పార్లమెంట్ లో భారీ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.