మ్యాగీకి మళ్ళీ పరీక్షలు

August 13, 2015 | 02:27 PM | 2 Views
ప్రింట్ కామెంట్
maggi_niharonline

హైకోర్టు నెస్లే కంపెనీకి కాస్త ఉపశమనం కలిగించింది. మ్యాగీపై ఆరువారాల పాటు నిషేధం ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మ్యాగీపై మరోసారి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది ఈ పరీక్షలను  జైపూర్ మొహాలీ హైదరాబాద్ లలో నిర్వహించాలని కోర్టు సూచించింది. ఆరు వారాల్లోగా పరీక్షా పలితాలు వెల్లడించాలని ఉత్వర్వుల్లో పేర్కొంది.పరీక్షా ఫలితాలు అనుకూలంగా వస్తేనే మ్యాగీ అమ్మకాలు తిరిగి కొనసాగించాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. కాగా.. మ్యాగీలో సీసం మోనో సోడియం గ్లుటామేట్ వంటి హానికర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు కొన్ని ప్రయోగ కేంద్రాల్లో నిర్థారణ కావడంతో దీనిపై కేంద్రం నిషేధం విధించింది. మోనో సోడియం గ్లుటామేట్ వలన పిల్లలకు వాంతులు అవుతాయి..మానసిక సంబంధమైన వ్యాధులూ వస్తాయి అని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకాలం నిబంధనలకు విరుద్ధంగా తయారైన మ్యాగీ ఉత్పత్తులపై కంపెనీ వివరణ ఇచ్చినప్పటికీ కేంద్రం ఏకీభవించలేదు. నార్త్ టు సౌత్ ఇలా అన్ని రాష్ట్రాలూ ఒక్కొక్కటిగా ముందుకువచ్చి మ్యాగీపై నిషేధం విధించాయి. కాగా ఈ సంస్థకు కేంద్రం 630 కోట్ల జరిమానా విధించింది. ముంబయ్ లో కూడా మ్యాగీపై నిషేధం కొనసాగుతూనే ఉంది. తాజా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మ్యాగీకి ఊరట లభించినట్లైంది.మరోవైపు కంపెనీ ప్రతినిధులు తాము మళ్లీ మార్కెట్లోకి వస్తామంటూ ప్రకటలనలు చేస్తున్నారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ