ఇస్రోకు ఇందిరాగాంధీ శాంతిబహుమతి

November 20, 2014 | 12:33 PM | 33 Views
ప్రింట్ కామెంట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ఈ ఏడాదికిగానూ ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికైంది. నిరాయుధీకరణ, అభివృద్ధి వంటి అంశాలను పరిగణలోకి శాంతి కోసం పాటుపడేవారికి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలోని కమిటీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ప్రాజెక్టును విజయవంతం చేయడం ద్వారా ఇస్రో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని అందులో పేర్కొంది. అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించుకొనేందుకు వీలుగా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నందున ‘ఇస్రో’కు ఈ బహుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ