హాక్యర్ల కోసం బాస్ రెడీ!

September 15, 2015 | 03:55 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Indian-govt-launch-own-operating-system-official-use

ప్రస్తుతం అంతా ఆన్ లైన్ జమానానే నడుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలు మొద‌లుకొని ఆర్థిక లావాదేవీలు, బుకింగ్ లు ఇలా ప్రతీ ఒక్క సౌకర్యం ముందున్న సిస్టమ్ ముందో, లేదా మొబైల్ ఫోన్లలోనో చేసుకునే సౌకర్యం ఉంది. అదే టైంలో హ్యకర్లు తమ హస్తవాసిని కూడా చూపుతున్నారు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్న హ్యాకర్లకు అలవోకగా వారి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు.

అయితే రక్షణ రంగానికి సంబంధించిన సమాచారంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కీలక సమాచారం ఈ మధ్య హ్యక్ అయిన వార్తలు మనం విన్నాం. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఓ కొత్త ఆలోచన చేసింది. అదే సొంత ఆపరేటింగ్ సిస్టమ్స్ రూపకల్పన. విండోస్, లైనెక్స్ లాంటి ఓఎస్ లు అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడీ కొత్త విధానంతో హ్యాకర్లకు చెక్ పెట్టడంతోపాటు సమాచారాలకు భద్రత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇది ఎంత వరకూ నమ్మకంగా ఉంటుంది.

ఫర్ ఎగ్జాంపుల్ ఓ కార్యాలయం నుంచి అధికారిక ఆదేశాలను ఆన్ లైన్ లో మెయిల్ పంపుతున్నారు. ఆ మధ్యలోనే వారు దూరి ఆదేశాలను మార్చేస్తున్నారు. అయితే పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా చెక్ పెట్టొచ్చని టెక్నిషియన్స్ చెబుతున్నారు... చెన్నైలోని జెప్పియార్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన పరిశోధకులు ఈ కొత్త పద్ధతిని అభివృద్ధి పరిచారు. ఆన్‌లైన్‌ ధ్రువీకరణ ప్రక్రియను మరింత సురక్షితంగా చేసేందుకు కొత్త తరహా కీస్ట్రోక్‌ క్రమసూత్ర పద్ధతిని ఇందుకోసం ఉపయోగించారు వారు. ఇంటర్‌నెట్‌ను వినియోగించేవారు సర్వసాధారణంగా ఎదుర్కొనే.. పాస్‌వర్డ్‌ మర్చిపోవడం, హ్యాకర్ల ముప్పు, తేలికగా ఫిషింగ్‌ బారిన పడటం సర్వసాధారణం. వీటన్నింటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వారు చెబుతున్నారు. అన్నట్లు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు చెప్పలేదు కదా... ‘‘ భార‌త్ ఆపరేటింగ్ సిస్టమ్ ’’(బీఓఎస్).

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ