ముష్టి వీరలేవరా... పాట పాడి చావరా

August 11, 2015 | 02:50 PM | 3 Views
ప్రింట్ కామెంట్
indian_beggars_for_central_schemes_niharonline

బిచ్చగాళ్లు గుళ్లు గోపురాల దగ్గర రద్దీ ఉన్న చోట తమదైన శైలిలో అడుక్కుంటం రివాజు. కొంతమంది కోతుల్ని గోవుల్ని వాడుతుంటారు. మిసెస్ అమలానాగార్జున దీనిపై మాటాడిందో లేదో మరి? కొంతమంది కళ్లతోటే అడుక్కుంటారు. సిగ్నల్స్ దగ్గర కారు అద్దం దింపి ఉంటే వాటిపై దరువేస్తారు. తీసి ఉంటే చేయి దుర్చి మన పార్టు ఏది అందితే దాన్ని సవరిస్తారు.

                       ముష్టి కళాకారుల టైపు వేరు. ప్రభువు పై కొంతమంది ఆధారపడితే వెంకన్న బాబుపై కొందరు, అల్లా మియాపై మరికొందరు బరువుమోపి మత కలహాలకి అతీతంగా పాటలు పద్యాలతో రంజింపజేస్తూ ముష్టిగానం ఆలాపిస్తుంటారు. ఏదో ఇంతవరకు ఎవరిమానాన వాళ్లు అడుక్కుంటూ దర్జాగా, నిశ్చింతగా బ్రతుకుతున్న బిచ్చగాళ్లు ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. దీనికి సాంగ్ అండ్ డ్రామా డివిజన్ వారు నగిష్ లు చెక్కుతున్నారు. ప్రభుత్వ పథకాలు పాటల రూపంలో బిచ్చగాళ్ల నోటి ద్వారా వినిపించి ప్రచారం చేద్దామనే అద్భుతమైన యోచన చేస్తున్నారు. ఈ దెబ్బతో ముష్టి వాళ్ల బ్రతుకులు మటాష్. విపక్ష దానకర్ణులు ఖచ్ఛితంగా ఒక్క పైసా ముష్టి వెయ్యరు. ఇదేదో గొంతు బావుందే అనుకుంటూ జేబులో చెయ్యిపెట్టి విషయం అర్థం కాగానే ఆ చెయ్యి పైకి రాదు మరి! ఏదేమైనా బిచ్చగాళ్ల నిర్మూలనా పథకం లా కనిపిస్తుందా లేదా? ఏం చెప్పగలం! ముష్టి వారు ముందు ముందు ఈ దేశ భవిష్యత్ నిర్ణయిస్తారేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ