యాదవ పెద్దలు చుట్టాలవుతున్నారు

November 28, 2014 | 10:40 AM | 37 Views
ప్రింట్ కామెంట్

రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రవులు ఎవరూ ఉండరనది నిజం. ఒకప్పుడు రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా మెలిగిన సమాజ్ వాదీ, ఆర్జేడీ పార్టీలు మధ్య ఈ మధ్యే మైత్రి కుదిరింది. ఇప్పుడి స్నేహం ఇంకా బలపడి బంధుత్వంగా మారబోతుంది. ఆర్జేడీ చీఫ్ లాలూ, యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు అత్యంత సన్నిహితులయ్యారు. ఒకప్పుడు మిత్రులుగా కొనసాగి, ఆ తర్వాత శత్రువులుగా ఉన్న యాదవ ద్వయం త్వరలో బంధువులు కాబోతున్నారు. ములాయం మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు, లాలూ చిన్న కుమార్తె రాజ్ లక్ష్మీకి వివాహం కుదిరింది. డిసెంబర్ మధ్యలో వీరి నిశ్చితార్థం జరిగే అవకాశముంది. ఇక పెళ్లి ఫిబ్రవరిలో చేయాలని భావిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యూపీలోని మొయిన్ పురి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తమ స్నేహం బంధుత్వంగా మారబోతోందని లాలూ, ములాయం ప్రకటించేశారు కూడా. రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీహార్ లోని అధికార జేడీ(యూ), ఆర్జేడీతో నిర్ణయించుకున్నాయని తెలిసిందే. ఇప్పుడు ఈ కూటమికి వివాహమనే బంధంతో సమాజ్ వాదీ కూడా మద్ధతు తెలపడంతో ఉత్తరాది రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ