వాద్రా కేసులో అధికారిపై వేటు

November 18, 2014 | 10:56 AM | 44 Views
ప్రింట్ కామెంట్

హర్యానా రాష్ట్రంలో భూముల అన్యాక్రాంతం కేసులలో ఓ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రభుత్వ అధికారులతో కుమ్మకై డీఎల్ఎఫ్ సంస్థకు అప్పనంగా కట్టబెట్టారని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భూముల అప్పగింతకు సంబంధించి అనుమతులు ఇచ్చిన దల్బిందర్ సింగ్ అనే ఏసీఓ అధికారిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దల్బిందర్ పై ఈ కేసుతో పాటు గురుగావ్ జిల్లాలోని రోజ్ కా గుజ్జర్ అనే గ్రామంలోని భూములను కూడా అక్రమంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. విచారణలో ఆయన ప్రమేయం ఉందని స్పష్టంగా తేలడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దల్బిందర్ హర్యానాకు చెందిన ఓ మాజీ మంత్రికి బంధువని తెలుస్తోంది. మొత్తానికి హర్యానాలో అధికారంలోకి వచ్చి నెల తిరగకుండానే బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ప్రారంభించినట్లు కనిపిస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ