ఇది ఎక్కడో వేరే దేశంలో కాదు. మన దేశంలోనే. అవునండీ. ప్రస్తుతం ఉన్న ధరకి ఈ రేటుకి ఏ మాత్రం సంబంధం లేదు కదా. కానీ, అక్కడి పరిస్థితులు ఇలా రేట్లను ఆకాశానంటేలా చేస్తున్నాయి.
మణిపూర్ ప్రస్తుతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇన్నర్ లైన్ పర్మిట్ విధానం అమలును డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో నిత్యావసరాల ధరలు రెట్టింపు అయి జనాల జేబులకు చిల్లులు పడేలా చేస్తుంది. ఆహార పదార్థాలు దొరకడం గగనమైతే, పెరిగిన ధరలు భయానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ అక్కడ లీటర్ కి రూ.190. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడమే ఈ ధరల పెరుగుదల కారణమని ప్రజలు వాపోతున్నారు. ఇదే అదనుగా భావించి బ్లాక్ మార్కెటింగ్ కూడా జోరందుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రజావసరాల దృష్ట్యా ట్రాన్స్ పోర్ట్ వారితో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ప్రజలు కొరుతున్నారు.