‘సత్యం’ కోడలు కొత్త దుకాణం తెరుస్తుంది

August 20, 2015 | 12:11 PM | 6 Views
ప్రింట్ కామెంట్
satyam_kin_sandhya_raju_call_health_centre_niharonline

దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది సత్యం కుంభకోణం. బైర్రాజు రామలింగ రాజు దెబ్బకి  భారత్ లో ఐటీ రంగం ఏ రేంజ్ లో కుదేలయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక కుంభకోణంలో దోషిగా తేలిన ఆయన దాదాపు వ్యాపార రంగం నుంచి కనుమరుగై పోయారనే చెప్పాలి. కానీ, ఆయన కుటుంబానికి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటుంది. మరోసారి వినూత్న వ్యాపార మంత్రంతో రంగప్రవేశం చేయబోతుంది. అయితే ఈసారి సీన్ లోకి వచ్చింది ఆయన కోడలు సంధ్యారాజు.

                              ప్రస్తుతం ‘కాల్ హెల్త్’ పేరుతో కొత్త సర్వీస్ సెంటర్ ను ప్రారంభించేదుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నయా కాన్సెప్ట్ ప్రకారం... ఇంటి చెంతకే వైద్యం.   విదేశాల్లో ఉంటున్న వారు ఇక్కడ ఉంటున్న తమ తల్లిదండ్రులకు వైద్యం చేయించడం అంటే అంత సులువు అయ్యే పరిస్థితి కాదు. కానీ ఇక్కడున్న తల్లిదండ్రులు సేఫ్‌గా ఉండాలనే భావన వారిలో ఉంది. ప్రధానంగా ఇలాంటి వారిని ఉద్దేశించి కాల్ హెల్త్ పేరిట కొత్త వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈఎంఆర్ఐ -108లో అత్యున్నత స్థానంలో పనిచేసిన సుధాకర్ సీవోవోగా, టెక్ మహీంద్రాలో కీలక పొజిషన్‌లో పనిచేసిన హరి సీఈఓలు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇక  సంధ్యారాజు ప్రమోటర్ గా వ్యవహరించనున్నారు. 70 కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రారంభిస్తున్న ఈ కొత్త వ్యాపారంలో విస్తరణకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు చెప్పారు. చెన్నై రామ్ కో గ్రూప్ ప్రమోటర్ల కుటుంబానికి చెందిన సంధ్యా రాజు రామలింగరాజును వివాహం చేసుకుని సత్యం కోడలుగా మారారు. సైకాలజీలో పట్టా తీసుకున్న సంధ్యకు వ్యాపార రంగంలో అమితాసక్తి. శాస్త్రీయ నృత్యంలోనూ ఆమెకు మాంచి ప్రావీణ్యం ఉంది. వచ్చే నెలాఖరు నుంచి సేవలు ప్రారంభించనున్న ఆమె తెలిపారు. వారసత్వంగా ఒంటబట్టిన వ్యాపార మెళకువలు అంత త్వరగా నీరుగారవు కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ