రన్నింగ్ కామెంటరీ

August 13, 2015 | 05:34 PM | 2 Views
ప్రింట్ కామెంట్
escaped_sangareddy_prisoners_niharonline

సంగారెడ్డి తెలుసు కదా మెదక్ జిల్లాలో ఉంది. అక్కడ  ఒక ఉప కారాగారం అంటే సబ్ జైలు కూడా ఉన్నట్టుంది. జైలు అనగానే దానిలో నివసించే పౌరుల్ని ఖౌదీలు అని పిలుస్తారు. వారికి న్యాయం చేసేందుకు సమయానుకూలంగా న్యాయదేవత ముందు పోలీసులు హాజరు పరుస్తుంటారు. ఈ రోజు ఇలాగే జరిగింది. హాజరయిన ఆ నలుగురు ఖైదీలు దొరికిన అవకాశాన్ని దొరక బుచ్చుకుని పరుగో పరుగు. తొలి దశలో ఒక కిలోమీటరు పరుగు పందెంలో చచ్చి చెడి, రొప్పుతూ రోజుతూ ఇద్దరు ఖైదీ బాబాయిల్ని పిలక పట్టుకుని వెనక్కి తీసొకొచ్చేరు. మిగిలిన ఇద్దరూ పరార్. దీని వలన మనం గ్రహించవలసిన నీతి ఏమిటి? ఈ మధ్యనే పోలీసు ఎంపికలో అయిదు కిలో మీటర్ల పరుగుని ఎత్తేశారు. ఈ నిబంధన పోలీసులకు వర్తించినా, నేరస్తులకు వర్తించదు. వాళ్ల బ్రతుకు గెరువుకి ఆధార భూతంగా వర్థిల్లే పరుగు అనే విద్యను దిగ్విజయంగా పోషించుకుంటున్నారు. అందు చేతనే సంగారెడ్డి నడి రోడ్డుపై జరిగిన పరుగు పందెంలో ఇద్దరు ఖైదీ నిపుణులు వారు సంపాదించుకున్న నైపుణ్యం పుణ్యమా అని స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలిగేరు. మిల్ఖాసింగు కీ జై!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ