జెంటిల్మెన్ గేమ్ గా పేరొందిన క్రికెట్ ను మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి భూతం ఆవహిస్తే క్రికెట్ సర్వనాశనం అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానిని జెంటిల్మెన్ గేమ్ గానే బతకనీయండని బీసీసీఐకి అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో విచారణ చేపట్టి ముద్గల్ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసిన సంగతి విదితమే. నివేదికపై విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా పేర్కొంది. బీసీసీఐ సంశయలాభం క్రికెట్ కే ఇవ్వాలే తప్ప వ్యక్తులకు కాదని న్యాయస్థానం సూచించింది. ముద్గల్ కమిటీ నివేదికలోని విషయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తీర్పు వెలువరిస్తామని తెలిపింది. బీసీసీఐ ఐపీఎల్ కు మాతృ సంస్థ అని, అవి రెండు పరస్పర లబ్ధిదారులేనని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యనించింది.