వడివడిగా పాతాళం వైపు....

August 25, 2015 | 11:42 AM | 1 Views
ప్రింట్ కామెంట్
sensex_fall_down_ most_in_seven_years_of_history_niharonline

అరరె సెషన్ ఆరంభంలో 370 పాయింట్ల లాభం. ఆహా... మన మార్కెట్లు రికవరీ అవుతున్నాయే అన్న ఆనందం. కానీ, ఇన్వెస్టర్లలో ఆ ఆనందం కనీసం 2 గంటలు కూడా నిలవలేదు. ఉదయం 11 గంటల సమయంలో క్రితం ముగింపు స్థాయికంటే కిందకు జారిన సూచికలు నష్టాలను నమోదు చేశాయి. 26,116 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 11.10 సమయంలో 150.57 పాయింట్లు పడిపోయి 0.58 శాతం నష్టంతో 25,590 పాయింట్ల వద్ద కొనసాగుంతుంది. దీంతో సెషన్ గరిష్ఠస్థాయితో పోలిస్తే సెన్సెక్స్ 520 పాయింట్లు పడిపోయినట్లయ్యింది. మిడ్ కాప్ 1.13 శాతం, స్మాల్ కాప్ 2.16 శాతం, బీఎస్ఈ 100, 200 సూచీలు అర శాతం నష్టంలో నడుస్తుడటంతో నేడు కూడా మార్కెట్లు అనిశ్చితిలోనే సాగవచ్చిన నిపుణులు భావిస్తున్నారు. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.39.నిన్న ప్రపంచ మార్కెట్ల పతనం ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రంగా నష్టపోయాయి. నిన్న ఒక్కరోజే 7 లక్షల కోట్ల రూపాయల సంపదన నష్టపోయారు. సోమవారం ఒక్కరోజు చోటు చేసుకున్న మహా పతనంతో సెన్సెక్స్ 1624 పాయింట్లు పడిపోయింది. 2014 ఆగస్టు పతనం తర్వాత ఇంత భారీగా తగ్గిపోవటం ఇదే మొదటిసారి. మార్కెట్ సెంటిమెంట్ నేపథ్యంలో.. ఈ పతనం 24 వేల కిందకు దిగినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. కాగా, మంగళవారం చైనా మార్కెట్ 4.5 శాతం నష్టపోయింది. ఆ ప్రభావమే ఇన్వెస్టర్లను కొత్త కొనుగోళ్లకు దూరంగా నిలిపిందని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ