బెంగాల్ సమ్మెలో చెలరేగిన హింస... పోలీసు కాల్పులు

September 02, 2015 | 02:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
west-bengal-bharath-bandh-firing-niharonline.jpg

దేశ వ్యాప్తంగా బుధవారం కార్మికులు తలపెట్టిన సార్వత్రిక సమ్మె పశ్చిమ బెంగాల్ లో హింసకు దారితీసింది. సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముర్షిదాబాద్ లో శాంతి యుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు వారికి జత కలిసిన సీపీఎం కార్యకర్తలపై తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లరువ్వి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘర్షణలకు అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

మరోవైపు తీవ్ర గాయాలయి నెత్తురోడుతున్న సీపీఎం కార్యకర్తలను కూడా వారు వదలలేదు. కిందపడేసి మరీ వారిపై లాఠీలు ఝుళిపించారు. ఇక ఈ కాల్పులతో ఎప్పుడేం జరుగుతుందోనని బెంగాల్ ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యవహార శైలి కార్మికుల హక్కులను కాలరాసేలా ఉందని మండిపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ