భారత్ లో వాట్సాప్ లైఫ్ టైం ఫ్రీ

November 20, 2014 | 02:41 PM | 44 Views
ప్రింట్ కామెంట్

భారత్ లో తమ అప్లికేషన్ ఉపయోగించుకున్నందుకు ప్రజల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని వాట్సాప్ సంస్థ తెలిపింది. వాట్సాప్ వాడుకున్నందుకు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని, అందువల్ల దానికి బదులు ఉచితంగా కొన్ని రకాల యాప్ లను వాడుకోవచ్చునని ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది. అయితే వాట్సప్ వీటంన్నింటిని ఖండించింది. ప్రస్తుతం భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం చాలా తక్కువగా ఉండటం వల్ల యాప్ వాడకదారుల సంఖ్యను పెంచేందుకే ప్రయత్నిస్తామని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా జీవితకాలం యాప్ ను ఫ్రీ అందిస్తామని సంస్థ ప్రతినిధి నీరజ్ అరోరా తెలిపారు. సో... ఫ్రెండ్స్ ఇక డౌట్స్ లేకుండా వాట్సప్ లో కుమ్ముకొండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ