చైనాను భారత్‌ అధిగమిస్తుంది!

December 06, 2014 | 05:28 PM | 112 Views
ప్రింట్ కామెంట్

ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గురువారం భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిపై వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు మూడేళ్ళలో వృద్ధి రేటులో చైనాను మనదేశం అధిగమిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే దేశంలో అంతర్గతంగా నెలకొన్న స్థిరత్వం మన దేశాన్ని అభివృద్ధి పధంలోకి నడిపిస్తుందని ముఖేష్‌ అంబాని పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్‌ ముందంజలో ఉందన్న విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని తెలిపారు. అలాగే చమురు ధరలు దిగి వస్తుండడం కూడా భారత్‌ వృద్ధికి ఎంతో దోహదం చేస్తోందని ముఖేష్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక 2014 సంవత్సరాన్ని మనదేశ చరిత్రలో అత్యంత అదృష్టకరమైన ఏడాదిగా ముఖేష్‌ అంబానీ అభివర్ణించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ