ఉన్నత న్యాయస్థానానికి తప్పని బాంబు బూచీ

August 18, 2015 | 02:46 PM | 2 Views
ప్రింట్ కామెంట్
bomb_threat_to_supreme_court_of_india_niharonline

దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. బాబు స్వ్కాడ్ రంగంలోకి దిగింగి. మరోవైపు సుప్రీంకోర్టు ఆవరణలో నిషేదాజ్ఞలు విధించారు. న్యాయవాదులు తప్ప మరెవరు వచ్చినా పూర్తి స్థాయిలో సోదా చేశాకనే అనుమతిస్తున్నారు.

ఈ లేఖ వచ్చి నాలుగు రోజులయిన విషయాన్ని గోప్యంగా ఉంచింది హోంశాఖ. ఉగ్రవాదులే ఈ లేఖ రాశారా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో బెదిరింపు లేఖ ఎక్కడ నుంచి వచ్చింది. ఎక్కడ పోస్టు అయింది. దాని మీద ఉన్న ముద్ర వంటి వివరాలను సేకరిస్తున్నారు పోలీసు అధికారులు. అదే సమయంలో సుప్రీంకోర్టు పరిసరాల్లో మరింత భద్రతను పెంచారు. అక్కడే కాదు..ఢిల్లీ పరిసరాల్లో నిఘాను మరింతగా పెంచడంతో పాటు అంతటా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఎక్కడ చూసినా ఇప్పుడు సుప్రీంకోర్టు బెదిరింపుల పైనే చర్చ సాగుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ