ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే సర్కారీ కొలువు

August 31, 2015 | 11:22 AM | 2 Views
ప్రింట్ కామెంట్
no-interview-for-govt-job-in-india.png

యువతకు చేరువయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.  రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఇంటర్వ్యూలో లోపాల వల్ల ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక పై ఉద్యోగ నియామకాల్లో రాత పరీక్ష తప్ప ఇంటర్వ్యూలు ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో కిందిస్థాయి ఉద్యోగులకు ఇంటర్వ్యూలు అవసరమా అని ప్రశ్నించిన ఆయన తాజా మన్ కీ బాత్ లో ఇంటర్వ్యూలను తొలగించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్వ్యూలకు రమ్మని పిలవగానే నిరుపేద ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు సిఫార్సులు, సహాయం కోసం పరుగులు పెట్టడం వల్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి వారంతా ఎక్కడి ఎక్కడి నుంచో వస్తున్నారని, అయితే అవినీతి కారణంగా అదంతా వ్యర్థమయిపోతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఇక పై కిందిస్థాయి ఉద్యోగుల నియామకాల్లో అలాంటివి జరగవని ఆయన వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ