పొగరాయుళ్లకు వరుసబెట్టి షాకులు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్డుకుని పొగాకు ఉత్పత్తులపై ఆంక్షలు విధించిన కేంద్రం, మరోవైపు కావాలని సిగరెట్ల ధరలను కూడా పెంచింది. ఇక ఇప్పుడు చిల్లర అమ్మకాలపై నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దేశంలో 70శాతం వినియోగదారులు ఒకటి రెండు సిగరెట్లు కొనేవారే. వీరి ద్వారానే సిగరెట్ల అమ్మకాలు బీభత్సంగా ఉంటున్నాయని ప్రభుత్వంచే నియమించబడ్డ నిపుణుల సంఘం నిర్ధారించిది. సిగరెట్ అమ్మకాల ద్వార ఏటా ప్రభుత్వానికి 25వేల కోట్ల ఆదాయం లభిస్తుంది. అయినప్పటికీ ప్రజల సంక్షేమం, ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో తెలిపారు. ఈ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే ఒకటి రెండు కొనే వీలులేక ధూమపాన ప్రియులు క్రమంగా ఈ అలవాటుకు దూమయ్యే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు. ఇక బహిరంగ ప్రదేశాలలో పొగతాగడంపై నిషేధం ఉన్నప్పటికీ దానిని ఉల్లంఘిస్తున్నే ఉన్నారు. ఈ విషయంలో కూడా కఠిన నిర్ణయం తీసుకొవాలని ప్రభుత్వం యోచిస్తుందట. బహిరంగ ప్రాంతాలలో ధూమపానం చేస్తే విధించే జరిమానాను ఇదివరకు రూ. 200 విధించేవారు. దానిని రాబోయే రోజులలో రూ. 20 వేల వరకు కూడా పెంచే విధానాన్ని రూపొందించనుంది. దీంతోపాటు సిగరెట్ తాగే వయస్సు పరిమితిని సడలించే యోయనలో ఉంది. వయస్సు నిర్ధారణను 18 నుంచి 25 కు పెంచనుంది. అమ్మకపు దారుల మీద కూడా కేంద్రం కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించింది. సిగరెట్ ప్యాకెట్ పై ప్రభుత్వం నిర్థేశించిన చట్టబద్దమైన హెచ్చరిక కనిపించకపోతే ఇదివరకు కేవలం రూ.5 వేలను జరిమానాగా విధించేవారు. ఇప్పుడు దీనిని కూడా రూ.50 వేలకు పెంచేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఇక ఈ నిబంధలన్నీ పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయి. సో... స్మోకర్స్ పొగతాగుట ఆరోగ్యానికే కాదు మీ పర్సకు కూడా హానికరమే.