సర్కారీ అనుమతి లేకుండా వెబ్ ఆధారంగా క్యాబ్ సేవలను కొనసాగిస్తున్న ట్యాక్సీ సర్వీసులను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల ఓ మహిళా ఉద్యోగినిపై ఉబెర్ క్యాబ్ డ్రైవర్ యాదవ్ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం హోం శాఖ ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సెల్ ఫోన్ ఆధారంగా నగర జీవులకు సేవలందిస్తున్న క్యాబ్ సర్వీసులు తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనిని కేంద్రం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.