పెద్దలు మారాం చేస్తున్నారు

December 06, 2014 | 04:08 PM | 43 Views
ప్రింట్ కామెంట్

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజ్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభ అట్టుడుకుతోంది. జ్యోతిని ఎట్టిపరిస్థితుల్లో మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని... తమ డిమాండ్ లో మార్పు ఉండదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు పలుసార్లు రాజ్యసభ కార్యకలాపాలకు అడ్డుతగిలారు. కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో నిరంజన్ జ్యోతి క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆమె చెప్పిన క్షమాపణను ఆమోదించాలని కోరారు. ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలను ఇప్పటికే తాను ఖండించానని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలు మనందరికీ గుణపాఠమని అన్నారు. భాష విషయంలో ప్రజాప్రతినిధులు సంయమనం పాటించాలని సూచించారు. అయినా పరిస్థితి మారలేదు. దీంతో వరుసగా మూడోరోజు కూడా విపక్షాల గందరగోళంతో సభ నడుస్తుంది. దీంతో, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఇప్పటి వరకు సభను రెండు సార్లు వాయిదా వేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ